మాజీ మంత్రిని కలిసిన ఏపీ ఎన్జీవోస్ అధ్యక్ష , కార్యదర్శి సంఘం నాయకులు
1 min readఆరోగ్యవంతంగా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు
మాగంటి బాబు ఉద్యోగస్తులకు చేసిన సహకారం మరువలేనిది
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకొంటున్న మాజీ పార్లమెంటు సభ్యులు,తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)ని ఏపీ ఎన్జీజీవోస్ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు, ఏలూరు తాలూకా అధ్యక్ష,కార్యదర్సులు జి. శ్రీధర్ రాజు,కె.సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు పూడి శ్రీనివాస్, నరేంద్ర, బేగ్, జయరాజు,తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ మాగంటి బాబు ఎంపిగా మంత్రి గా పనిచేసినప్పుడు ఎన్జీవోస్ తో ఉద్యోగులతో ప్రత్యేక అనుబంధంతో కూడి ఉండేవారన్నరు. సామరస్యంగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉండి అనేక సందర్భాల్లో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తన సహాయ సహకారాలు అందిచిన వ్యక్తి అని గుర్తుచేసుకున్నారు.త్వరలోనే ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి బాబు కూడా ఉద్యోగస్తులతో పాత జ్ఞాపకాలను నెమరువేసుకొని గుర్తు చేసుకున్నారు.