వికాసత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ బడ్జెట్
1 min readఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించడం ప్రశంసనీయం
వివేకానంద ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షులు కోలా భాస్కరరావు
కేంద్ర మంత్రులకు అభినందనలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : అన్నదాతలు, కార్మికులు, యువత, మహిళలకే కాక అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి పర్చే విధంగా వికసిత భారత్ లక్ష్యంగా ప్రధాని మోడీ బడ్జెట్ ఉందని, వివేకానంద ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షులు కోలా భాస్కరరావు అభివర్ణించారు. ప్రత్యేకంగా మునుపు ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు, అవసరం మేర మరిన్ని నిధులు కేటాయిస్తామని, ఆంధ్రప్రదేశ్ పునవ్యవస్తీకరణ చట్టం అమలుకు కట్టుబడి ఉంటామని, పోలవరం ప్రాజెక్టు త్వరిత పూర్తి చేసేందుకు అధిక నిధులు కేటాయిస్తామని, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపించి, అభివృద్ధికి సహకారం అందిస్తామని, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంద్ర వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి ద్వారా నిధులిస్తామని, విశాఖపట్నం,చెన్నై , హైదరాబాద్, బెంగుళూరు కారిడార్ల నిర్మాణం చేపడతామని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుస్తామని, ఆర్థిక మంత్రి నిర్మల సీతా రామన్ బడ్జెట్లో ప్రకటించడం పై ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కి, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కి భాస్కరరావు ఒక ప్రకటనలో అభినందనలు,ధన్యవాదములు తెలిపారు.