ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వండి
1 min readపిజిఆర్ఎస్ కు 171 ఫిర్యాదులు
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
- పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి స్వీకరించిన ప్రతి ఫిర్యాదును తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్, డిఆర్ఓ ఏ. పద్మజ, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయిలోని క్షేత్రస్థాయి సిబ్బంది తాసిల్దారు, ఎంపీడీఓల కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలోని సిబ్బంది ఆర్డిఓ కార్యాలయాలలో కచ్చితంగా హాజరై ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలన్నారు. అర్జీదారులకు ఇప్పటికీ తప్పుడు ఎండార్స్మెంట్లు ఇస్తున్నారని ఉన్న సమస్యను ప్రాపర్ గా ఎందుకు రిప్లై ఇవ్వలేకపోతున్నారన్నారు. ఇష్టానుసారంగా అర్జిదారులకు ఎండార్స్మెంట్లు ఇస్తే భవిష్యత్తులో తీవ్ర కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతి నియోజకవర్గానికి, మండలానికి స్పెషల్ అధికారులను నియమించి అభివృద్ధిని పర్యవేక్షిస్తామన్నారు. ప్రజల కోసం పెట్టిన గ్రీవెన్స్ రోజు సిబ్బందికి ఎలాంటి సెలవులు మంజూరు చేయబడవని ఆమె స్పష్టం చేశారు.పిజిఆర్ఎస్ లో స్వీకరించిన కొన్ని సమస్ నంద్యాల మండలం పాలూరు గ్రామానికి చెందిన పుల్లయ్య విజయ గ్రామ సంఘంలో వీ.ఓ.ఎ గా విధులు నిర్వర్తిస్తున్నానని… డిఆర్డిఎ – సెర్ప్ ఎపిఎం నిబంధనలకు వ్యతిరేకంగా ఆన్లైన్ లో విఏఓ ల పేర్లు మార్చి విధుల నుండి తొలగించారని ఎపిఎం మీద చర్యలు తీసుకొని నా ఉద్యోగం ఉండేలా చేయమని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు ను సమర్పించుకున్నారు.ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఎల్ఏ లోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.