ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల ఫీజుల దందా…
1 min readవివిధ రకాల పేర్లతో ఆర్థిక దోపిడీ
చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న డిఎంఅండ్హెచ్ఓ
డిఎంహెచ్ఓ పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్.
నర్సెస్ & నర్సింగ్ విద్యార్థి నాయకుడు భాస్కర్ నాయుడు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సోమవారం రోజున కర్నూల్ జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్య కి ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్ & నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ నాయుడు కర్నూల్ జిల్లాలోని నర్సింగ్ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా ఎగ్జామ్ ఫీజులు, క్లినికల్ ఫీజుల విషయంలో నర్సింగ్ కళాశాల యాజమాన్యాలు పాల్పడుతున్న ఆర్థిక దోపిడీ విషయంలో జిల్లా వైద్య అధికారి నిర్లక్ష వైఖరి గూర్చి వివరించి, జిల్లా వైద్య అధికారి పైన కఠిన చర్యలు తీసుకొని వెంటనే విధుల నుండి తప్పించాలి అని కోరారు. ఈ సందర్బంగా జేసీ నవ్య స్పందిస్తూ జిల్లా వైద్య అధికారి పైన వెంటనే ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకుంటాము అని తెలియజేశారు.