ఫిట్నెస్, పర్మిట్ లేని ప్రవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేయాలి
1 min readఆదోని డివిజన్ ఆర్టీవో ( ఎం వి ఐ ) శశిర దీప్తికు వినతి పత్రం ఇచ్చిన ఎన్ఎస్యు ఐ విద్యార్థి సంఘం నాయకులు
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో ఆదోని డివిజన్ వ్యాప్తంగా కండిషన్ పర్మిట్ లేని, అధిక విద్యార్థులను తరలిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల బస్సులపై చర్యలు తీసుకుని సీజ్ చేయాలని ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో నందలి ఆదోని డివిజన్ ఆర్టీవో( ఎం వి ఐ ) అధికారి శశిర దీప్తి కు వినతి పత్రం ఇచ్చి మాట్లాడారు. చాలా స్కూల్ కళాశాల బస్సులు అధిక విద్యార్థులను తరలిస్తూన్నారని,( కెపాసిటీకి మించి), ప్రభుత్వ నిబంధనలను పాటించని ఈ స్కూల్ ,కళాశాల బస్సులపై ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొన్ని విద్యాసంస్థలు కాలం చెల్లించిన బస్సులను నడుపుతున్నారని, వీటిపై ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించి స్కూల్ బస్సులను సీజ్ చేయాలని తెలిపారు. చాలా ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా లేదని తెలిపారు.ఈ కార్యక్రమంలో వినోద్, మహేష్ ,లక్ష్మణ్, విష్ణు,హర్ష పాల్గొన్నారు.