వడ్లరామాపురం హై స్కూల్లో సమస్యలు పరిష్కరించాలి : ఏఐఎస్ఏ
1 min readవడ్లరామాపురం హై స్కూల్ ను సందర్శించిన aisa జిల్లా కార్యదర్శి యస్. నాగార్జున
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ఆత్మకూరు మండలం వడ్లరామాపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి నాగార్జున, ఐసా నాయకులు విష్ణు వర్ధన్ సందర్శించి మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐసా జిల్లా కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ… వడ్లరామాపురం గ్రామంలో ఉన్న హై స్కూల్లో దాదాపుగా 200 నుంచి 250 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారని కానీ అక్కడ మౌలిక వసతులు ఏ మాత్రం లేవని పాఠశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేకపోవడం వల్ల విద్యార్థులు బయట చెట్ల కింద క్లాసులు వినే పరిస్థితి ఉందని క్లాస్ రూమ్లలో కూర్చోవడానికి డెస్క్లు లేక విద్యార్థులు కింద కూర్చుంటున్నారు, ఫ్యాన్లు, సరైన లైట్లు కూడా లేవని విద్యార్థులు ఆడుకోవడానికి ఆట స్థలం లేక విద్యార్థులు ఆటలకు దూరం అవుతున్నారని, పాఠశాల పక్కన ఉన్న కాలువ వల్ల విద్యార్థులు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని అమ్మాయిలకు కనీసం బాత్రూం సౌకర్యం లేక అమ్మాయిలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.హై స్కూల్ కోసం గ్రామంలోనే ప్రభుత్వం కొత్తగా పాఠశాల భవనం ఏర్పాటు చేసినప్పటికీ పాఠశాలలో కొన్ని పనులు అసంపూర్తిగా ఉండడం వల్ల విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.కావున విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే కొత్త పాఠశాల భవనంలో అన్ని పనులు పూర్తి చేసి విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణ చదువుకోడానికి వీలు కల్పించాలని కోరారు లేకపోతే ఐసా ఆధ్వర్యంలో విద్యార్థులను, తల్లిదండ్రులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.