హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ నంద్యాల : సొంత భవనాలు గా లేనటువంటి హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి. మెస్ కాస్మోటిక్ బిల్లులు విడుదల చేసి, మెస్సు కాస్మోటిక్ ఛార్జిలను పెంచాలి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డిఆర్ఓ కి వినతిపత్రం అందజేసినఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రతాప్, ధనుంజయ్ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిస్కారం చేయాలనీ నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి డిఆర్ఓ వినతిపత్రం ఇవ్వడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రతాప్, ధనుంజయ్ లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఆఫీస్ బేరర్స్ సురేష్, ఎర్రిస్వామి,ఉదయ్, ఏఐఎస్ఎఫ్ కార్యవర్గ సభ్యులు మనోజ్, దినేష్, వినోద్, తరుణ్, మరియు ఏఐఎస్ఎఫ్ నాయకులు హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.