టెక్నికల్ అసిస్టెంట్స్ సమస్యలు
1 min readపల్లెవెలుగు కల్లూరు అర్బన్ : కర్నూలు జిల్లా జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం యందు 25 మండలాలలో పనిచేయుచున్న టెక్నికల్ అసిస్టెంట్స్ కు సంబందించి సమావేశం జరిగింది. మంగళవారం సోషల్ ఆడిట్, సమస్యలు ప్రస్తుతం జరిగిన సమస్యల గురించి ప్రిసైడింగ్ అధికారి తీసుకున్న నిర్ణయాల ను వివరంగా “”పి డి,డ్వామా “” తో చర్చించడం జరిగినది అని తెలిపారు. ఈ సమావేశం లో టెక్నికల్ అసిస్టెంట్స్ సమస్య లు చెప్పుకున్నారు. వారు పీడీ డ్వామా కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అని తెలిపారు. ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి టెక్నికల్ అసిస్టెంట్స్ అందరికీ ధన్యవాదములు తెలియజేశారు. ఈ సమావేశం లో జిల్లా ప్రెసిడెంట్ తిరుమలేష్, మరియు టెక్నికల్ అసిస్టెంట్స్ అందరూ హాజరుకావడం జరిగింది.