వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో సమస్యలను పరిష్కరించాలి
1 min readఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సత్యన్న
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: పట్టణంలో మార్కెట్ యార్డ్ నందు రైతులు ఎదురుకుంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సత్యన్న డ్రమాండ్ చేశారు.శుక్రవారం నాడు స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డుకు సాధారణ తనిఖీల్లో భాగంగా విచ్చేసిన ఎడిఎం నారాయణ మూర్తికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సత్యన్న మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ లో రైతులకు వర్షం వచ్చినప్పుడు దూరప్రాంతాల నుంచి వచ్చిన రైతులు పూర్తిగా ఇబ్బంది గురవుతున్నారన్నారు.రైతుకువారి సరుకు టెండర్ దారుడు అనుమతి ఇస్తారు ఆ తర్వాత రైతులు సరుకును ఆరబెట్టుకోవడానికి రెండు రోజులు పడుతుంది కాబట్టి మార్కెట్ యార్డ్ లో కొత్త షెడ్లు నిర్మించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం కోరుతుందని తెలిపారు. అదేవిధంగా గతంలో మార్కెట్ యార్డ్ లో ఒక షెడ్డు లెంత్ లెవెల్ కి ఇవ్వడం జరిగిందని,దానికి పైకప్పు వేయడంలో ఇప్పటివరకు వేయలేదన్నారు. కొంతవరకు రైతులకు మేలు కలుగుతుందని కోరారు. అదేవిధంగా మార్కెట్ యార్డ్ లో పత్తిని కొనుగోలు చేసే విధంగా చూడాలని ఏడీఎం ని కోరారు. అదే విధంగా మార్కెట్ యార్డ్ లో త్రాగునీటి వసతి కల్పించి,రైతులకు విశ్రాంతి భవనము ఏర్పాటు చేయాలన్నారు.అలాగే రైతులకు మార్కెట్ యార్డులో కనీస వసతులైన మరుగుదొడ్లు కూడా నిర్మించాలని అన్నారు. మార్కెట్ యార్డ్ లో రైతులను దోపిడీ చేస్తున్న దళారులను అరికట్టాలని, మార్కెట్ యార్డ్ లో సరుకు దగ్గర చాట దాంతోపాటు చలిమలు పెట్టి రైతుల తెచ్చిన సరుకును దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. రైతులపై దోపిడీ చేస్తున్న వారిని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఎడిఎం నారాయణమూర్తిని కోరారు.ఈ కార్యక్రమంలో ఐ. ఎఫ్.టి.యు జిల్లా నాయకులు ఎస్.బాలరాజు,బాబు పాల్గొన్నారు.