వెలుగోడులో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు
1 min readపల్లెవెలుగు వెబ్ వెలుగోడు: వెలుగోడు అయపురెడ్డి నగర్ లో వెలసిన శ్రీ లక్ష్మీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నుండి మూడు రోజులపాటు శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై ధార్మిక ప్రవచనాలు, ప్రతి రోజు స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు, శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు, శనివారం సుదర్శన మహా మృత్యుంజయ హోమం, మహాబలి పూర్ణాహుతి, 108 కేజీల పులిహోరతో స్వామి వారికి తిరుప్పావడ సేవ, సాయంత్రం 5గంటలకు శ్రీనివాస కళ్యాణం, తదనంతరం భక్తులందరికీ మహాప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు శ్రీలక్ష్మి ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షులు బల్లాని వేంకట సత్యనారాయణ, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తెలిపారు. ఇందుకు సంబంధించి కరపత్రాలను స్థానిక భక్త సమాజంతో కలిసి ఆవిష్కరించారు. మొదటి రోజు శ్రీమద్రామాయణంపై యం.మద్దయ్య స్వామి ప్రవచించారు.ఈ కార్యక్రమంలో ధర్మప్రచార మండలి సభ్యులు ఉదారపు రామలింగేశ్వర రెడ్డి, భజన మండలి అధ్యక్షులు తెలుగు నాగలక్ష్మమ్మ, జ్యోత్స్న, సాలమ్మ, అంజనమ్మ, వెంకటేశ్వర్లు,రాజు, శివుడు, ఆంజనేయులు, భరత్ , బి.రాము, నాగేశ్వరరావు, లక్ష్మీ నారాయణ, రమణయ్య, మురళీ కృష్ణ, నాగార్జున, సంజీవరాయుడు, యం. సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.