జిల్లాలో 12 సబ్ రిజిష్ట్రారు కార్యాలయాల పరిధిలో మార్కెట్ విలువల పెంపు ప్రతిపాధనలు
1 min readప్రతిపాధిత పెంపు విలువ సమాచారం ఈనెల 20 నుంచి igrs.ap.gov.in website లో ప్రదర్శన
సదరు అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకొని డిశంబరు 27వ తేదీన కమిటీ తుది ప్రతిపాదనలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: ఏలూరు జిల్లా రిజిస్ట్రారు కార్యాలయ పరిధిలో ఉన్న 12 సబ్ రిజిస్ట్రారు కార్యాలయాలలో మార్కెట్ విలువల పెంపుదల ప్రతిపాదనలు సంబంధిత సబ్ రిజిస్ట్రారులు రూపొందించారని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తెలిపారు. ఇందుకు సంబందించి గురువారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో మార్కెట్ విలువల రివిజన్ కమిటీ చైర్మన్, జాయింటు కలక్టర్ పి. ధాత్రిరెడ్డి అధ్యక్షతన జిల్లాలోని సబ్ రిజిస్ట్రారులు కన్వీనర్లు గా మార్కెట్ విలువలు సమావేశం జరిగింది. సమావేశంలో ఏలూరు జిల్లా రిజిస్ట్రారు కె. శ్రీనివాసరావు, జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజీవీడు, చింతలపూడి మున్సిపల్ కమీషనర్లు, సంబందిత ఆర్డిఓలు, భూసేకరణ అధికారులు, అర్బన్ డెవలప్మెంట్ అధికారులు పాల్గొని పలు అంశాలు చర్చించారు. కమిటీ సూచనలు మేరకు కమిటీ చైర్మన్, జాయింటు కలక్టర్ పి. ధాత్రిరెడ్డి మార్కెట్ విలువల ప్రతిపాదనలు ప్రాధమికంగా ఆమోదించారు. సదరు ప్రాధమిక ఆమోదం పొందిన ప్రతిపాదనలను igrs.ap.gov.in website లో డిశంబరు 20వ తేదీన సబ్ రిజిస్ట్రారులు నమోదు చేస్తారు. అదే విధంగా సదరు విలువలను సబ్ రిజిస్ట్రారు, జిల్లా రిజిస్ట్రారు కార్యలయం నోటీసు బోర్డులో సైతం ప్రదర్శించబడతాయి. ఈ మార్కెట్ విలువల పై ఎటువంటి అభ్యంతరాలున్నా సంబందిత సబ్ రిజిస్ట్రారు ను కానీ జిల్లా రిజిస్ట్రారును కానీ 24.12.2024 వ తేదీ లోపు అభ్యంతరాలను లిఖిత పూర్వకము గా తెలియజేయాలని జిల్లా రిజిస్ట్రారు కె. శ్రీనివాస రావు తెలిపారు. సదరు అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకొని ది.27.12.2024 న కమిటీ తుది ప్రతిపాదనలను ఆమోదిస్తుందని జిల్లా రిజిస్ట్రారు, కె.శ్రీనివాస రావు తెలిపారు.