ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవాలి – యుటిఎఫ్
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు శాంతి ప్రియ పిలుపునిచ్చారు.స్వాతంత్య్ర సమరయోధుడు,భారత దేశ మొదటి విద్యా శాఖా మంత్రి,భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని యుటిఎఫ్ ఆధ్వర్యంలో ప్యాపిలి మండల అధ్యక్షులు రమేష్ నాయుడు అధ్యక్షతన ప్యాపిలి బాలుర జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల యందు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాంతి ప్రియ మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రాథమిక విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసే జిఓ నంబర్ 117 తీసుకొని వచ్చి 3,4,5 తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలలలో విలీనం చేసిందని దుయ్యబట్టారు.బోధన రెండు మాధ్యమాలలో సమాంతరంగా కొనసాగించాలని పేర్కొన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యారంగ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు.ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అయినా విద్యా రంగానికి ఎక్కువ స్థాయిలో బడ్జెట్ కేటాయించి విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు.అనంతరం జాతీయ విద్యా దినోత్సవ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం – విద్యారంగానికి ఆయన చేసిన కృషి అనే అంశంపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో ప్రథమ,ద్వితీయ,తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు నందీశ్వర రెడ్డి,రాజేంద్ర,రమేష్,శేఖర్,మోహన్ రావు,శ్రీకళ,శాంతి కుమార్,భాగ్య లక్ష్మీ,శ్రీదేవి,సువర్ణ తదితరులు పాల్గొన్నారు.