ఎల్ఎల్సీ కాల్వ వ్యర్ధ పదార్థాలను తొలగించి ప్రజల ఆరోగ్యం కాపాడాలి
1 min readమున్సిపల్ కార్యాలయం ధర్నా, కమిషనర్ వినతి: సిపిఐ
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణ సమీపంలో ఉన్న ఎల్ఎల్సీ కాలువలో పడి ఉన్నా విష, వ్యర్థ పదార్థాలను తొలగించి పట్టణంలో ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందని సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి సమీవుల్లా, జిల్లా సమితి సభ్యులు బి.టి చిన్నాన్న తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ తుంగభద్ర ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసిన నేపథ్యంలో ఎల్ఎల్సీ కాలువ కు వస్తున్న సందర్భంగా తక్షణమే ఆ కాలువలో ఉన్న వ్యర్థ పదార్థాలు తొలగించాలని అనేక దఫాలుగా సిపిఐ గా అనేక పోరాటాలు చేసిన ఎల్ఎల్సి అధికారులు మరియు మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమని, ఆ ఎల్ ఎల్ సి కాలువ ద్వారా వచ్చే నీరును పట్టణ ప్రజల తాగునీరు ఉపయోగిస్తారని కాబట్టి తక్షణమే తొలగించాలని ఆందోళన చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కేసీ జబ్బర్, తిమ్మ గురుడు, వీరేష్, విజేంద్ర, మల్లికార్జున్ గౌడ్, కాజా, రవి, ఖాదర్, నరసింహులు,ఎల్లప్ప, సమీర్,ఇస్మాయిల్,తదితరులు పాల్గొన్నారు
ఎల్ఎల్సీ కాలంలో వ్యక్తపదార్థాలను తొలగించినందుకు ధన్యవాదాలు: సిపిఐ
ఎల్ఎల్సీ కాలువలో పడి ఉన్న వ్యర్థా విష పదార్థాలను తొలగించాలని అనేక దఫాలుగా సిపిఐ ఆధ్వర్యంలో చేసిన పోరాటాలకు స్పందించి, మున్సిపల్ అధికారులు తొలగించినందుకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పక్షాన మున్సిపల్ అధికారులకు ధన్యవాదాలు తెలపడం జరిగిందని సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ సమీవుల్లా తెలిపారు.