ఆదోని లో ప్రతి పౌరుని రక్షణ నా బాధ్యత ..ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ ఆదోని: గ్రౌండ్ నట్ అసోసియేషన్ వారూ మర్యాద పూర్వకంగా కలవటం జరిగింది. ఈ సందర్భంగా అసోషియేషన్ సభ్యులు వారి వ్యాపారం లో వారు ఎదుర్కుంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకోని రావటం జరిగింది. అందులో ముఖ్యంగా మా వ్యాపారం లో భాగంగా లారీలు బడుగులకు సంబంధించిన సమస్య,వైఎంకే నల్ల గేట్ దగ్గర అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం కొరకు విన్నవించుకోవటం జరిగింది.దానికి ఎమ్మెల్యే స్పందిస్తూ అతి త్వరలో లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ మరియు గ్రాండ్ నట్ వ్యాపారస్తులు అందరూ కలసి సామావేశం ఏర్పాటు చేసి, అక్కడే సమస్యల పరిష్కారించుకుందామని హామీ ఇచ్చారు. అలాగే అండర్ గ్రాండ్ బ్రిడ్జి నిర్మాణం గురించి అధికారులతో మాట్లాడి పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని అన్నారు.అదే విధంగా ప్రతి వ్యాపారస్తుడు నిజాయితీ గా వినియోగ దారులను ఇబ్బందీ పెట్టకుండా మీరు వ్యాపారం చెయ్యాలని, మీకు ఏ కష్టం వచ్చిన ఖచ్చితంగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆసోషియేష్ పెద్దలు సరణప్ప, కే. తాతప్ప, కే. మల్లికార్జున తదితరులు పాల్గోన్నారు.