PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ ( ఏఐటీయూసీ ) ఆధ్వర్యంలో నిరసన

1 min read

విద్యుత్ మీటర్ రీడర్స్ కు యాజమాన్యం నిర్ణయించిన రేటు ప్రకారం కాంట్రాక్టర్  ఈపీఎఫ్  ఈ ఎస్ ఐ  చెల్లించాలని ధర్నా:

ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ (ఏఐటీయూసీ) యూనియన్

 పల్లెవెలుగు న్యూస్ ఎమ్మిగనూరు : పట్టణంలో విద్యుత్ మీటర్ రీడర్స్ కార్మికులకు ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారంగా పీసి రేటు ఇచ్చి,గత కాంట్రాక్ట్ చెల్లించిన  ప్రకారంగా ఈపీఎఫ్, ఈఎస్ఐ,చెల్లించాలని కోరుతూ బుధవారం రోజున ఎమ్మిగనూరు విద్యుత్ కార్యాలయం ముందు ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ ( ఏఐటీయూసీ ) ఆధ్వర్యంలో  నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందనీ ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జి నరసింహారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు వీరేష్, డివిజన్ కోశాధికారి ఉరుకుందు, ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి తిమ్మ గురుడు తెలిపారు.అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఎమ్మిగనూరు డివిజన్ పరిధిలోనే విద్యుత్ మెటీరియర్సు 76 మంది ఉన్నారనీ, కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్లు  ఈపీఎఫ్ సర్వీసులకు అనుగుణంగా కట్టడం లేదనీ ,మరియు ఈఎస్ఐ గత మూడు నెలలుగా నవంబర్ డిసెంబర్,జనవరి సంబంధించి తక్కుగా కాంట్రాక్టులు కడుతున్నారనీ, దీనిపై కాంట్రాక్టులు ప్రశ్నిస్తే మేము లోకేష్ పాదయాత్రలో పాల్గొని ఆయనతో మాట్లాడి ఈ కాంట్రాక్టును దక్కించుకోవడం జరిగింది కాబట్టి మేము ఇచ్చినంత మీరు తీసుకోవాలి లేకపోతే మీరు వెళ్లిపోండి అని బెదిరించడం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి కార్మికుల కడుపుల మీద కొట్టేకాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ తాలూకా సహాయ కార్యదర్శి విజేంద్ర విద్యుత్ మీటర్ రీడర్స్ నాయకులు ఎం.నరసప్ప, చంద్రశేఖర్, భీమేష్, కిరణు, శ్రీకాంత్, ఉరుకుందు, గూడూరు ఖాజా హుస్సేన్, శేఖర్ బాబు, బి నరసింహులు, ఇనాయితుల్ల, పాల్గొన్నారు

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *