ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ పెరేడ్ కు ఎంపిక గర్వకారణం..వీసి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాయలసీమ విశ్వవిద్యాలయ జాతీయసేవాపథకానికి చెందిన వాలంటీర్ ఎ.కె. హర్షవర్ధన్ జనవరి 26వ తేదీన ఢిల్లీలో జరిగే రిపబ్లిక్తే పెరేడ్కు ఎంపికకావడం వర్సిటీతోపాటు జిల్లాకు ఎంతోగర్వకారణమని వర్సిటీ వైస్ ఛాన్సులర్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్ అభినందించారు. నగరంలోని సెయింట్ జోసఫ్స్ డిగ్రీకాలేజి (సుంకేసుల రోడ్) లో బి.కాం. తృతీయ సంవత్సరం చదువుతున్న హర్షవర్ధన్ నవంబరు 12 నుండి 21 వరకు జల్గామ్, మహారాష్ట్రలోని కేబిసి నార్త్ మహరాష్ట్ర యూనివర్సిటిలో నిర్వహించిన ప్రీ పరేడ్ క్యాంపులో జాతీయస్థాయికి ఎంపికైనట్లుగా ఆయన వివరించారు. విశ్వవిద్యాలయంతోపాటు అనుబంధ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తయారుచేయడంలో ఎన్ఎస్ఎస్ కీలకభూమిక పోషిస్తుందని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయ్ కుమార్ నాయుడు కొనియాడారు. ఈ దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఎన్ఎస్ఎస్ విభాగాన్ని వర్సిటీ వి.సి. రిజిస్ట్రార్లు అభినందించారు. డిసెంబరు 30 వ తేదీన ఢిల్లీకి ప్రయాణమయ్యే హర్షవర్ధన్ ఫిబ్రవరి మొదటివారం వరకు అక్కడే దాదాపుగా 40 రోజులపాటు వివిధ అంశాల్లో శిక్షణ పొందుతాడని వర్సిటీ ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ పి. నాగరాజు వివరించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ కె. వెంకటరత్నం, డాక్టర్ బి. విజయుడు, డాక్టర్ నాగచంద్రుడు, శివప్రసాదరెడ్డి, సెయింట్ జోసఫ్స్ డిగ్రీ కళాశాల (సుంకేశుల రోడ్) ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కె. రమేష్ తదితరులు పాల్గొన్నారు.