PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే మేడం మా ఊరికి బస్సు సౌకర్యం కల్పించండి

1 min read

– ఆళ్లగడ్డ విద్యార్థుల విజ్ఞప్తి

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  ఒకప్పుడు ఆ గ్రామం నుంచి ప్రధాన కేంద్రాలైన నంద్యాల నందికొట్కూరుకు బస్సు సౌకర్యాలు ఉండేవి అలగనూరు రిజర్వాయర్ నిర్మించిన తర్వాత తలముడిపి గ్రామం నుండి కొత్త రహదారి నిర్మాణం జరగడంతో మజార గ్రామమైన ఆళ్లగడ్డ గ్రామానికి కనీసం మండల కేంద్రమైన గడివేముల నుండి కూడా రవాణా సౌకర్యం లేదు అత్యవసరంగా పని పడితే ఆటోలకో ప్రైవేట్ వాహనాలకు ఆశ్రయించాల్సిందే . ఆర్టీసీ బస్సు చూడక చాలా సంవత్సరాలు అయిందని గ్రామస్తులు వాపోయారు మోడల్ స్కూల్ కు వెళ్లాలంటే విద్యార్థినిలు ఆటోలలో ప్రయాణించాల్సిందే. విద్యార్థి బస్సు మా ఊరి పై తిరిగేలా ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి చొరవ తీసుకోవాలని గ్రామానికి రోజు ఏదో ఒక సమయంలో ఆర్టిసి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆళ్లగడ్డ గ్రామస్తులు కోరుతున్నారు.

About Author