మహిళాలకు ఉపాధి కల్పించడం కొరకు వీహెచ్పి ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీ భవాని జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవాలయం, శివాలయం వీధి, బుధవారం పేట, కర్నూలు. గత 18 నెలల నుండి సేవా బస్తీలో మహిళలకు విశ్వ హిందూ పరిషత్ ఉచిత కు శిక్షణ కేంద్రం నిర్వహిస్తూ 15 మందికి ఉపాధిని కల్పించగలిగింది.మహిళలకు రామ తులసి శిక్షణ కేంద్రం నిర్వహిస్తూ ఉంటారు.శిక్షణ పొందిన వారికి వారి ఉపాధి కొరకు విశ్వ హిందూ పరిషత్ & బాల సాయిబాబా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు వీరికి అందించడం జరిగినది. శిక్షణ పొందుతున్న వారు తులసి, చంద్రకళ, సువర్ణ, జయలక్ష్మి, హారిక, నాగేశ్వరమ్మ, మంజుల, నాగేశ్వరి, మాధవి, లక్ష్మి, సుబేదా, సుస్మిత, ఉమాదేవి, కళావతి, తదితరులు. పాల్గొన్నారు.