జర్నలిస్టులకు ఫెన్షన్ సౌకర్యం కల్పించండి
1 min readఅర్హులైన జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
జర్నలిస్టుల కాలనీలను నిర్మించాలి.
జర్నలిస్టులపై దాడులను నివారణ కమిటీలు తక్షణమే పునరుద్దించాలి.
జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి.
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఎటువంటి భద్రత లేకపోయినా నమ్ముకున్న వృత్తిపై మమకారం చంపుకోలేక పని చేస్తున్న పాత్రికేయులకు ఫెన్షన్ సౌకర్యం కల్పించాలని జర్నలిస్టుల ఫోరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ ,సాయికుమార్ నాయుడుకోరారు. ఈ మేరకు కర్నూలు జిల్లాకు వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి రామానాయుడుకు వినతి పత్రం అందించారు. రోజురోజుకీ మీడియా సిబ్బందిపై దాడులు.. హత్యలు.. అపహరణలు పెరుగుతున్న నేపథ్యంలో జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం నేతలు కోరారు.. రాష్ట్రంలో మీడియా రంగంలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు… 15 ఏళ్ల పాటు జర్నలిజం లో పనిచేసిన జర్నలిస్టులకు నెలకు పదివేల రూపాయలు పింఛన్ అందించాలని కోరారు… దేశంలో అనేక రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పింఛన్లు ఇస్తున్నారని.. అదే తరహాలో మన రాష్ట్రంలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులకు పింఛన్లు సత్వరమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు… గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం అందిస్తున్న ఆక్రిడేషన్ లు కుదిస్తూ జీఓ నెంబర్ 142 తీసికివొచ్చిందని ఈ జీవో ను వెంటనే రద్దు చేసి.. అర్హులైన వారందరికీ సబ్ ఎడిటర్లతో సహా సత్వరమే అక్రిడేషన్లు మంజూరు చేయాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతో పాటు ప్రత్యేక కాలనీలు ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని కోరారు.. ఇక ఇళ్ల స్థలాలు ఉన్న జర్నలిస్టులందరికీ గృహాలు మంజూరు చేయాలన్నారు. జగన్నాథ గట్టులో జర్నలిస్టు స్థలాలకు ప్రొటెక్షన్ కల్పించడంతోపాటు రోడ్లు, విద్యుత్ దీపాలు కల్పించాలని కోరారు.సమాచార పౌర సంబంధాలశాఖ కు పూర్వ వైభవం తీసుకురావాలని .. ప్రెస్ అకాడమీకు పాలకవర్గాన్ని నియమించాలని కోరారు. అక్రిడేషన్ కమిటీలను పునరుద్దించాలి. జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీలను పునరుద్దించి.. కమిటీలను బలోపేతం చేయాలి.రాష్ట్రంలో ఉన్న మీడియా సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి మీడియా సంక్షేమానికి పెద్దపీట వేయాలని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు రామకృష్ణ, సాయికుమార్ నాయుడు, రాష్ట్ర నాయకులు మధు సుధాకర్, హరినాథ్ రెడ్డి, సిటిజన్ శ్రీనివాసులు,జిల్లా నాయకులు షేక్షావలి , వారణాసి ప్రసాద్, జాకీర్ ,రాఘవేంద్ర, ఉరుకుందు, సుధాకర్ తదితరులున్నారు.