హోళగుంద నుండి ఆదోని వరకు రోడ్డు సౌకర్యం కల్పించండి..
1 min readహెబ్బటం గ్రామం నుండి ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఒక్క రోజు పాదయాత్రను జయప్రదం చేయండి..
పల్లెవెలుగు వెబ్ హోళగుంద: కరపత్రాలు విడుదల చేసి పాదయాత్రను విజయవంతం చేయాలని హోళగుంద మండల ప్రజలను కోరిన ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ.పల్లె వెలుగుహొళగుంద;- ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండల కేంద్రంలో ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ హోళగుంద నుండి ఆదోని వరకు రోడ్డు సౌకర్యము కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన పాదయాత్ర కరపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా చిప్పగిరి లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతంగా ఉంది. విద్య, వైద్యం, అక్షరాస్యత, త్రాగునీరు ఇంకా అనేక రంగాలలో వెనుకబడి ఉంది. మండలంలో ప్రధాన సమస్య హోళగుంద నుండి ఆదోని మరియు హోలగుంద నుండి ఆలూరు వెళ్ళే రహదారులు అద్వానంగా ఉన్నాయి. ఈ రోడ్లు గుండా ప్రయాణించాలంటే ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్ రాని దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. కావున హోలగుంద నుండి ఆదోని వరకు రోడ్డు సౌకర్యము కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఎమ్మార్పీఎస్, బీఎస్పీ మరియు విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 06-01-2025 సోమవారం ఉదయం 9 గంటలకు హెబ్బటం గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. కనుక హోళగుంద మండల ప్రజలు అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ పాదయాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ హోళగుంద మండల అధ్యక్షులు అమానుల్లా, ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు లింగంపల్లి రామాంజనేయులు, చిప్పగిరి మండల అధ్యక్షులు డేగులపాడు మంజునాథ్, సిపిఐ జిల్లా కార్యదర్శి హనుమంతు, కృష్ణ, సిపిఎం హోలగుంద మండల కార్యదర్శి వెంకటేష్, ఎమ్మార్పీఎస్ పత్తికొండ డివిజన్ అధ్యక్షులు గూల్యం యల్లప్ప మాదిగ, ఆదోని డివిజన్ అధ్యక్షులు వెంకటేష్ మాదిగ, ఆలూరు తాలుకా అధ్యక్షులు కత్తి రామాంజనేయులు మాదిగ, నవ్యాంధ్ర నాయకులు శాసం రామాంజనేయులు, సీనియర్ నాయకులు ఎల్లార్థి మహేష్ మాదిగ, హోలగుంద మండల అధ్యక్షులు వీరేష్, లింగంపల్లి హనుమేష్, సినిమా మంగన్న, గజ్జేహల్లి తాయన్న మరియు కోగిలతోట, గజ్జేహల్లి, లింగంపల్లి, కురుకుంద, మార్లమడికి, ఎల్లార్థి, చిన్నహ్యాట గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.