PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధ్యాయులకు భధ్రత కల్పించండి.. ఫ్యాప్టో 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : గ్రామాలలో జరిగే పాఠశాల నిర్వహణ  కమిటీ ఎన్నికలను కట్టుదిట్టమైన భద్రతల నడుమ జరపాలని మంగళవారం స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్కు ఫ్యాప్టో వినతిపత్రం అందజేసింది. ఈనెల 17వ తేదీన పత్తికొండ మండల పరిధిలోని అటి కలగుండు గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు సంభందించిన జరిగే పాఠశాల నిర్వహణ కమిటీ (SMC) ఎన్నికలు  కట్టుదిట్టమైన భద్రత కల్పించి ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని ఉపాద్యాయ సంఘాల సమాఖ్య  సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించారు. యుటిఎఫ్​ నాయకులు ప్రసాద్ బాబు,భాస్కర్,చంద్రమౌళి, ఏపీటీఎఫ్​,  నాయకులు పాండు రంగా రెడ్డి,జయరాముడు, వన్నూరప్ప, లోక్యనాయక్,మరియు ఎస్​టియు,  నాయకులు కుంపటి నారాయణ,సత్యనారాయణ, చంద్రశేఖర్, సంజీవయ్య, మారుతి, కృష్ణమూర్తి కలిసి సిఐ  వినతి పత్రం అందజేశారు.

About Author