PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలి

1 min read

ప్రజా పంపిణీ వ్యవస్థను ధరల స్త్రీ కరణ, నాణ్యమైన వస్తువులతో బలోపేతం చేయాలి

 జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి

నాణ్యమైన బియ్యం, నిత్యవసర సరుకులు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేలా కృషి చేయాలనీ జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి చెప్పారు.  స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో బుధవారం ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం, నాణ్యమైన వస్తువులు పంపిణీ, పంపిణీ విధానం, ధరల స్థిరీకరణ, తదితర అంశాలపై  వివిధ వర్గాల నుండి అభిప్రాయాలను, వారి సమస్యలను జేసీ అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జేసీ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ  ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జిల్లాలో ప్రజలకు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నామన్నారు.  ప్రజా పంపిణీ వ్యవస్థను  మరింత బలోపేతం చేసేందుకు సమాజంలోని వివిధ వర్గాల నుండి అభిప్రాయాలను సేకరిస్తున్నామన్నారు.

 ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా  నాణ్యమైన బియ్యం, నిత్యావసర  సరుకులు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.  ఫోర్టిఫైడ్ బియ్యం వినియోగం కారణంగా మహిళలల్లో ముఖ్యంగా గర్భీణీలు, బాలింతలు, చిన్న పిల్లల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం అధిగమించవచ్చన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్న ఫోర్టిఫైడ్ బియ్యం ప్రయోజనాలు ప్రజలకు తెలియజేసి, వాటిని వినియోగించేలా అవగాహన కలిగించాలన్నారు.   ఎం.ఎల్.ఎస్. పాయింట్ల వద్ద ఖచ్చితమైన తూకం ఉండేలా చూడాలన్నారు. ప్రజలకు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలకు బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ, వినియోగంపై పటిష్టమైన నిఘాతో తనిఖీలు చేయాలన్నారు. ఇందుకోసం  పౌర సరఫరాలు, రెవిన్యూ, ఫుడ్ సేఫ్టీ, తూనికలు కొలతలు అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేయాలనీ, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలు, వసతి గృహాలలో ఆహరం నాణ్యతలు తరచూ తనిఖీలు చేయాలనీ జేసీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణలో మిల్లర్ల సమస్యలు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ లో రేషన్ షాప్ డీలర్లు , ఎం డి యూ వాహనదారులు, సూచనలు, సమస్యలను జేసీ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డి ఎస్ ఓ ఆర్.ఎస్. సత్యనారాయణరాజు, పౌర సరఫరాల సంస్థ డిఎం మంజుభార్గవి, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జయప్రకాష్ , విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ షరీఫ్, ఏలూరు జిల్లా చాంబర్స్ అఫ్ కామర్స్ అధ్యక్షులు నేరెళ్ల రాజేంద్ర, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు  కుమార్, రేషన్ షాప్  డీలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కోశాధికారి  రాజులపాటి గంగాధర్, ఉపాధ్యక్షులు  మరీదు వెంకటరావు, వివిధ శాఖల అధికారులు, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు,  వివిధ సంఘాల ప్రతినిధులు,  ప్రభృతులు పాల్గొన్నారు.

About Author