ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
1 min readసైబర్ నేరగాళ్లకు అవకాశం ఇవ్వకుండా స్మార్ట్ వినియోగించండి
జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్
గ్రీవెన్స్ కు వచ్చిన ఫిర్యాదుదారులకు శ్రీ సత్య సాయి సేవ ట్రస్ట్ నుంచి భోజన సదుపాయం
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్, అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్య చంద్ర రావు,ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమమును నిర్వహించినారు.ఈ పబ్లిక్ గ్రీవెన్స్ (రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ఫిర్యాదిదారులు వచ్చి ఇచ్చిన పిర్యాదు లలో ఎక్కవగా భూ తగాదాలు మరియు వివాహ సంబంధమైన విషయాల పై ఎస్పీ కి ఇచ్చినారు. పబ్లిక్ గ్రీవెన్స్నకు వచ్చిన వృద్ధులు వికలాంగులను గమనించిన జిల్లా ఎస్పీ వారి వద్దకు వెళ్లి వారి యొక్క సమస్యలను గురించి అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చినారు.పబ్లిక్ గ్రీవెన్స్ కు మహిళా ఫిర్యాదు దారులు చిన్నపిల్లలతో రావడానికి గమనించి జిల్లా ఎస్పీ చిన్న పిల్లలకు స్వీట్స్ మరియు బిస్కట్ లను అందించినారు.పబ్లిక్ గ్రీవెన్స్ లోకి వచ్చినటువంటి ఏలూరు సైబర్ సెల్ సిబ్బందితో సైబర్ నేరలపై అవగాహనను కలిగి ఉండాలని, బ్యాంక్ ఫ్రాడ్ డిజిటల్ అరెస్ట్ బహుమతులు వచ్చాయని చెప్పి మోసగించే మోసగాళ్ల పట్ల మరియు సెల్ ఫోన్ లలో ఏపీకే యాప్ ద్వారా చేసే మోసాలను గురించి ప్రజలకు అవగాహనను కల్పించినారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ ఢిల్లీ ముంబై కలకత్తా చెన్నై లో నుండి సిబిఐ ఈడి అధికారులు అని చెప్పి ఫోన్లు చేసి మీరు సైబర్ నేరాలకు పాల్పడ్డారని చెప్పి బెదిరించి మీపై కేసును పలానా పోలీస్ స్టేషన్లో నమోదు చేశాము అని చెప్పి సదరు కేసులో మీ పేరును తొలగించాలి అని అంటే మీరు డబ్బులు చెల్లించాలని చెప్పి వచ్చే అనుమానాస్పద కాల్స్, సందేశాలపై cybercrime.gov.in లో తక్షణమే ఫిర్యాదు చేయండి. మీ చుట్టు ప్రక్కల వారు సైబర్ నేరగాళ్లకు పడకుండా ఏ మాత్రం సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇవ్వకుండా స్మార్ట్ వ్యవహరించండి.ఈ కార్యక్రమానికి వచ్చిన సుమారు 47 ఫిర్యాదులు ఆన్నింటి పై సత్వరమే చట్ట ప్రకారం ఫిర్యాదిదారులు యొక్క సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ ఫోన్ లో మాటలాడి అధికారులకు తెలియ చేసినారు. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఏలూరు జిల్లా నలుమూలల నుంచి పబ్లిక్ గ్రీవెన్స్ కు వచ్చిన ఫిర్యాదిదారులకు భోజన సదుపాయాలను శ్రీ సత్య సాయి సేవా సమితి వారి యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేయించి ప్రజలకు భోజన సదుపాయం కల్పించిన జిల్లా ఎస్పీ కి కృతజ్ఞతలను తెలియ చేసినారు.