PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోగులకు పబ్లిక్ హెల్త్ ఔట్ రీచ్ కార్యక్రమం

1 min read

ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

వైద్య పరీక్షలు చేసిన సీనియర్ ఆయుర్వేద వైద్య అధికారి ..డా:కె లక్ష్మీ సుభద్ర

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పబ్లిక్ హెల్త్ ఔట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా ఆయుష్ డిపార్ట్మెంట్ కమిషనర్ మరియు ప్రాంతీయ ఉప సంచాలకులు ఏలూరు వారి ఆదేశాలనుసారము మంగళవారం ఏలూరు పట్టణం నాలుగో డివిజన్.లంబాడిపేట అంగన్వాడి సెంటర్ నందు ఆయుర్వేద డిస్పాంక్షనరీ సీనియర్ వైద్యాధికారి డాక్టర్:లక్ష్మీ సుభద్ర రోగులను పరీక్షించి రక్తహీనత, ఎముకలు, కీళ్ల నొప్పులు, రక్త భారము మరియు సిజనల్ వ్యాధులకు మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరానికి సుమారు 150 మంది పాల్గొని వైద్య పరీక్షలో చేయించుకున్నారు. సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు సబ్బుతో చేతులను శుభ్రపరచుకోవడం, పరిసరాల పరిశుభ్రత, నిద్రించే సమయంలో దోమతెరలు కట్టుకోవడం, ఆయుర్వేద ప్రాముఖ్యత పై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద సిబ్బంది, వైద్య సిబ్బంది, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author