ప్రజా సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలి
1 min readసీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కు సంబంధించి వచ్చే ప్రజా సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు..ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను జాప్యం లేకుండా సంతృప్తికరమైన పరిష్కారమివ్వాలని కలెక్టర్ ఆదేశించారు.. కొంతమంది అధికారులు వచ్చిన అర్జీకి సరైన ఎండార్స్మెంట్ ఇవ్వడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు..కొన్ని శాఖల అధికారులు సంబంధం లేని అంశాలను అప్లోడ్ చేయడం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు..ఇలా అప్లోడ్ చేసిన వెల్దుర్తి ఈఓపిఆర్డీ పై చార్జెస్ ఫ్రేమ్ చేయాలని కలెక్టర్ జిల్లా పరిషత్ సీఈఓ , డిపిఓ ను ఆదేశించారు. అదే విధంగా కర్నూలు మున్సిపాలిటీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ విభాగపు అధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ ను కలెక్టర్ ఆదేశించారు. ఎండార్స్మెంట్, విచారణ నివేదిక లను అప్లోడ్ చేయడంపై అధికారులకు సరైన స్పష్టత లేదని, ఈ అంశాలపై జిల్లా అధికారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని కలెక్టర్ డిఆర్ఓను ఆదేశించారు.సిఎం కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదులు 20 పెండింగ్ లో ఉన్నాయని, వాటికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ, సరైన విధంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.అలాగే రీఓపెన్ కేసులకు సంబంధించి మొత్తం 21 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, అందులో రెవెన్యూ లో 14, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ లో 3, సర్వే లో 2, పంచాయతీ రాజ్ 2, పోలీసు, ఆర్డబ్ల్యూఎస్ వద్ద ఒక్కొక్కటి ఉన్నాయని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కొండయ్య, చిరంజీవి, నాగ ప్రసన్న లక్ష్మి, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.