ప్రజాసేవకే..వచ్చా…
1 min readభూకబ్జాలు…దందాలు చేయను…
- డాక్టర్ను… ఆశీర్వదించండి…
- ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి
ఆదోని, పల్లెవెలుగు: ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని… ఒక్కసారి అవకాశం ఇచ్చి తనను గెలిపించాలని ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి కోరారు. ఆదివారం నగరంలోని కల్లుబావి, వాల్మీకినగర్తోపాటు నియోజకవర్గంలోని దొడ్డనగేరి గ్రామాల్లో కూటమి నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. పార్థసారధి మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే… ఎమ్మెల్యే మారాలి అనే నినాదం ప్రజల్లో నుంచి వచ్చిందని, తాను కొత్తగా సృష్టించింది కాదన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రోడ్లు, వీధిలైట్లు, తాగునీటి సమస్యతో ప్రజలు అష్టకష్టాలు పడుతుంటూ… ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కేంద్రం, రాష్ట్రం నుంచి వచ్చిన నిధులు దోచుకుతిన్నాడని ఆరోపించారు. తాను వృత్తి రీత్యా డాక్టర్ అని… భూదందాలు, కబ్జాలు చేయనని, అవినీతి పరులు తన దగ్గర లేరని చెప్పారు. పదైదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి మరిచారడని, మరోసారి వైసీపీకి ఓటు వేస్తే ఆదోని అభివృద్ధిలో మరో 30 ఏళ్లు వెనకబడిపోతుందని ఆందోళన చెందారు. ప్రజలు ఆలోచించి… తనకు ఓటు వేసి వేయించాలని కోరారు. రాష్ట్రంలో వచ్చేది కూటమి ప్రభుత్వమేనని, తనను గెలిపిస్తే ఆదోనిని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానన్నారు. అంతకు ముందు ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప, సీనియర్ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.