ప్రజా సంక్షేమమే నా ఆకాంక్ష..!
1 min readనందికొట్కూరు అభివృద్ధి నా ఆశయం.
తెలుగుదేశం గెలుపే నా లక్ష్యం.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : ప్రజా సంక్షేమమే నా ఆకాంక్ష అని నియోజకవర్గ అభివృద్ధి నా ఆశయమని నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య అన్నారు. బుధవారం నందికొట్కూరు నియోజకవర్గ టీడీపి, జనసేన, బీజేపి, ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య ఆధ్వర్యంలో చేపట్టిన శంఖారావం ప్రచారంలో భాగంగా పట్టణంలోని సీఎస్ఐ పాలెంలో, ఇందిరా నగర్ లో అడుగడుగునా జనప్రభంజనాన్ని తలపించింది. అస్తవ్యస్తమైన రోడ్లు, తాగునీరు, సాగునీరు, వీధి లైట్ల నిర్వహనలో లోపం ఇలా ప్రతి ఒక్కరూ జయసూర్య తో తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. తన భర్త చనిపోయి 12 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు తనకు పింఛన్ మంజూరు చేయలేదని కాలనీకి చెందిన ముని పాటి శాంతమ్మ టీడీపీ నాయకుల ముందు ఆవేదన వ్యక్తంచేశారు. తన భర్త రక్షకుడు కు వృధ్యాప పింఛన్ వచ్చెదన్నారు. వైసీపీ నాయకులు పట్టించుకోవడం లేదని వాపోయారు.ఈ సందర్భంగా జయసూర్య మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలు పడుతోన్న ఇబ్బందులన్నింటినీ తొలగించి పల్లె, పట్టణం అనే తేడా లేకుండా నియోజకవర్గానికి సరికొత్త రూపును తేవడమే కాకుండా, ప్రగతి పథంలో నడిపిస్తానని, అభివృద్ధి అంటే ఏంటో చూపించి తనను గెలిపించి అసెంబ్లీకి పంపించిన ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. అయిదేళ్ల వైసీపి పాలనలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని జనం వాపోతున్నారు. కుల,మతాలకతీతంగా, బడుగు, బలహీన వర్గాలకు ఆశరాగా నిలిచే ప్రజా ప్రభుత్వం రాబోతుందని ప్రజలు, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, గత అయిదేళ్లలో జరిగిన మోసాలను, అవినీతిని దృష్టిలో పెట్టుకుని నిశ్వార్ధంగా ప్రజాసేవ చేయడానికొచ్చిన తనను సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు.బుధవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో మొదలైన ప్రచారం జనసందోహం మధ్య, టీడీపి, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వెంటనడువగా విస్తృత ప్రచారాన్ని చేపట్టారు.కార్యక్రమంలో నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, వార్డు ఇంచార్జ్ లు ముర్తుజావలి, జాకీర్ హుస్సేన్, జమీల్, రసూల్, వహీద్, సత్తార్, చాంద్ బాషా, షాలు, రవి, ధర్మ , అయ్య రాజు, భరత్, శాంతరాజు, ఎల్లయ్య ఆచారి, ఏసేపు, సురేంద్ర, శ్రీకాంత్ గౌడ్, ఉపేంద్ర, కళాకార్, నిమ్మకాయల రాజు, రాజన్న, జయన్న, కృష్ణారెడ్డి, మన్సూర్, జనసేన నాయకులు మధు, పుష్పరాజు ,టీడీపి,జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.