PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

8 ఏల్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: AIDSO – AIMSS సంఘాల ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా, ముచ్చుమర్రి పరిధిలో ఎల్లాల గ్రామంలోని 8 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని, మానవ మృగాలుగా మారుస్తున్న అశ్లీల, హింసాత్మక సినిమాలను, టివి కార్యక్రమాలను, పోర్నోగ్రఫీని, మద్యం, డ్రగ్స్, బెట్టింగ్ లను నిషేధించాలని డిమాండ్ చేస్తూ, నగరంలో ర్యాలీ చేపట్టి, 5 రోడ్ల కూడలి నందు మానవహారం చేపట్టారు.ఈ సందర్భంగా AIDSO రాష్ట్ర అధ్యక్షులు వి. హరీష్ కుమార్ రెడ్డి, AIMSS రాష్ట్ర కార్యదర్శి ఎం. తేజోవతి మాట్లాడుతూ – నంద్యాల జిల్లాలోని, ముచ్చుమర్రి పరిధిలో ఎంతో సంతోషంతో ఆడుకుంటున్న 9 సంవత్సరాల బాలిక, అకస్మాత్తుగా కనిపించకుండా, చివరికి అత్యాచారం చేసి, కాలువలో పడేశారని, ఆ అత్యాచారం చేసింది కూడా ముగ్గురు మైనర్లు అని తెలిసే సరికి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారని తెలిపారు… ఒక సమాజం ఎంత అభివృద్ధి చెందిందో తెలుసు కోవాలంటే ఆ సమాజంలోని మహిళల అభివృద్ధియే కొలమానమని అన్నారు… కాని ప్రస్తుతం మన దేశంలో మహిళల పరిస్థితిని చూసినట్లయితే పుట్టిన బిడ్డ నుండి కాటికి కాలుచాచిన ముదుసలి వరకు ఎక్కడా మహిళలకు రక్షణ అనేది లేదని, ఇంటా, బయట, పాఠశాల, కాలేజీ, ఆఫీసు ఎక్కడా మహిళలకు రక్షణ భద్రత లేదన్నారు. ఇలాంటి దిగజారిన విష సంస్కృతి గ్రామాల్లోని పేదల్లోకి కూడా చొరబడిందని, ఇప్పుడు ఇవన్నీ పసిపిల్లల మొదళ్లులోకి కూడా చేరుతున్నాయని, ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో నేటి పిల్లలను కాపాడుకోకపోతే, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరింతగా సొంత ఇంట్లోనే పునరావృతం అవుతాయని హెచ్చరించారు.నేడు మహిళలకు, బాలికలకు అమ్మాయిలకు రక్షణ,గౌరవం కావాలంటే మానవ మృగాలుగా మారుస్తున్న మద్యం, మత్తు పదార్థాలు, అశ్లీల సినిమా సాహిత్యాలు, ఫోర్నోగ్రఫీ, డ్రగ్స్, బెట్టింగ్ లను నిషేధించాలని రక్షణ, న్యాయ వ్యవస్థలను పునర్వ్యవస్థీకరించాలని, విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పు రావాలని, గొప్ప వ్యక్తులైన భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వారిని విద్యార్థులకు ఆదర్శంగా తీసుకునేలా, వారి గురించి పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో AIDSO నగర అధ్యక్ష, కార్యదర్శులు జహీర్, మల్లేష్, AIMSS నాయకులు రోజా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author