PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ట్యాంకుల శుద్ధీకరణ షురూ..

1 min read

గ్రామాల్లో వెయ్యి దాకా వాటర్​ ట్యాంకులు శుభ్రం

  • ప్రజలకు మంచినీరు అందించడమే లక్ష్యం
  • పంచాయతీరాజ్​ శాఖ జిల్లా అధికారి నాగరాజు నాయుడు

కర్నూలు, పల్లెవెలుగు: గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు మంచినీరు అందించడమే లక్ష్యమన్నారు పంచాయతీ రాజ్​ శాఖ జిల్లా అధికారి నాగరాజు నాయుడు. బుధవారం ఆయన ఛాంబరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కలెక్టర్​ జి. సృజన ఆదేశాల మేరకు … జిల్లాలోని 484 గ్రామపంచాయతీలు, అదనంగా 230 గ్రామాల్లోని వాటర్​ ట్యాంకులు, నీటితొట్లు, పైపులైన్లు తదితర తాగునీటికి సంబంధించినవన్నీ శుభ్రం చేయిస్తున్నామన్నారు.  జిల్లాలో మొత్తం 3349 వాటర్​ ట్యాంకులు ఉండగా మంగళ,బుధవారాల్లో దాదాపు వెయ్యి ట్యాంకులను శుభ్రం చేశామని, మిగిలినవి నాలుగు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. వర్షాకాలంలో సీజనల్​ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున… ముందు జాగ్రత్త చర్యగా కర్నూలు జిల్లాలోని వాటర్​ ట్యాంకులు, నీటితొట్లు, పైపులైన్లు తదితరవి శుభ్రం చేసే పనిలో సిబ్బంది నిమగ్నమైనట్లు ఆయన పేర్కొన్నారు. ట్యాంకుల శుభ్రతకు గ్రామీణ ప్రజలు, రాజకీయ నాయకులు పూర్తిగా సహకరించాలని ఈ సందర్భంగా పంచాయతీరాజ్​ శాఖ జిల్లా అధికారి నాగరాజు నాయుడు పేర్కొన్నారు.

About Author