“మరణంలోనూ జీవిస్తున్న మన జంపా” “పుస్తకావిస్కరణ”..
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: “మరణంలోనూ జీవిస్తున్న మన జంపా” “పుస్తకావిస్కరణ”.. మరణించినప్పటీ సమాజానికి సేవలందిస్తున్న కీ. శే. జంపా కృష్ణ కిషోర్ అని జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక సభ్యులు డా.వి.బ్రహ్మా రెడ్డి అన్నారు.. బుదవారం స్థానిక బిర్లా కాంపౌండ్ లోని జెవివి జిల్లా కార్యాలయంలో జన విజ్ఞాన వేదిక జంపా ప్రథమ వర్ధంతిని నిర్వహించి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది.సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెవివి సంస్థ వ్యవస్థాపక సభ్యులలో తనతో పాటు జంపా వున్నారని తన తుది శ్వాస వరకు సంస్థ కోసం పనిచేశారని కొనియాడారు. రాష్ట్ర అధ్యక్షులు బర్మా సురేష్ మాట్లాడుతూ జంపా తుది శ్వాస వరకే మాత్రమే కాక తన మరణం కు ముందే తన మరణం తరువాత తన శరీరాన్ని బావి వైద్యులు కోసం మెడికల్ కాలేజ్ విద్యార్థులకి ఉపయోగ పడాలని కోరుకున్నారని (BODY DONOR)అదేవిదంగా వారి పార్థీవ దేహాన్ని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కు అందచేయడం జరిగిందన్నారు. వారి కుమార్తె శ్రీమతి అరుణ విజయశ్రీ కుటుంబ సబ్యులు ముందుకి వచ్చి తండ్రి ఆశయం కోసం సెంటిమెంటును పక్కన పెట్టి మారు మాట్లాడకుండా ఒప్పుకున్నారని వారికి సంస్థ ఎప్పటికీ రుణ పడి వుంటుందన్నారు. జాతీయ నాయకుల మొహమ్మద్ మియ్య జంపాసేవలు కొనియాడుతూ పాటలు పాడటం జరిగింది.. ఈ కార్యక్రమం లో జాతీయ,రాష్ట్ర కమిటీ నాయకులు బాషా,కొండమ్మ, శ్రీరాములు సుజాత,జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, యోహాన్,ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక జిల్లా సెకరెట్రి రవి కుమార్, రామ లక్ష్మణ, శేషారెడ్డి,సుబ్బారాయుడు,పాణి తదితరులు పాల్గొన్నారు.