PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అపర చాణక్యుడు మన  పివి నరసింహారావు

1 min read

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు  కే బాబురావు     

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పీవీ నరసింహారావు అజాతశత్రువు, అపర చాణక్యుడని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు కె బాబురావు ఆయన సేవలను కొనియాడారు. శ్రీ పివి నరసింహారావు  104వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. తెలుగువారి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన ఎందరో మహానుభావుల్లో మన పివి నరసింహా రావు  ఎనలేని కీర్తి దక్కించుకున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన హయాంలో భూసంస్కరణల చట్టం తీసుకొచ్చి వందలాది ఎకరాలు కలిగివున్న భూస్వాముల నుంచి భూములను ఒకే చట్టం ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకునేట్టు చేశారని భూస్వాముల ఆగ్రహావేశాలను లెక్కచేయకుండా భూసేకరణ చట్టం పకడ్బందీగా అమలు చేసిన ధైర్యశాలి మన పివిని భూస్వాముల కుటుంబానికి చెందిన పీవీ తన పన్నెండు వందల ఎకరాల భూమిని భూమిలేని పేదలకు పంచారని పివీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పెత్తందార్లు అడవులలోని వన్యమృగాలను చంపడంతో చలించిపోయి వాటి సంరక్షణకు వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చారని  పివీ సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించు కోవాలని భావించిన శ్రీమతి ఇందిరా గాంధీ  ఆయనను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించారని పివి  శ్రీమతి ఇందిరా గాంధీ కి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారని ఎమర్జెన్సీ తర్వాత దేశమంతటా కాంగ్రెస్ ఓడిపోయినా మన రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ జెండా రెపరెపలాడించాడని నాడు రాష్ట్రంలో 42 పార్లమెంటు స్థానాల్లో 41 స్థానాలు కాంగ్రెస్‌కు రావడం వెనుక పివి పాత్ర కీలకమని ఇందిర గాంధీ హయాంలో తన బహుముఖ ప్రతిభ సామర్థ్యాన్ని అంతర్జాతీయ దౌత్యానికి ఉపయోగించారని  ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆరు మాసాల్లో నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన ఘనత మన పివికి దక్కుతుందని భారత  ప్రధానిగా ఉన్న కాలంలో దేశంలో ఎన్నో రాజకీయ ఆర్థిక సామాజిక మలుపులు చోటు చేసుకున్నాయని దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం కల్పించి సంస్కరణలకు బీజం వేశారని అందుకే పీవీని దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పిలుస్తారని దేశాన్ని ఏలిన ఏకైక తెలుగు వాడిగా చరిత్రకెక్కిన పీవీ గొప్పతనం గురించి బాబురావు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.   ముందుగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యాలయం నందలి స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు చిత్రపటమునకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కార్యకర్తల సమావేశం జరిగినది.ఈ సమావేశంలో వక్తలు ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో  మాజీ మంత్రివర్యులు మూలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ, పిసిసి ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ, డిసిసి గౌరవాధ్యక్షులు ఉండవెల్లి వెంకటన్న, డిసిసి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అనంతరత్నం మాదిగ, ఐ ఎన్ టి సి జిల్లా అధ్యక్షులు బి బతుకన్న, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ ఈ లాజరస్, ప్రముఖ వైద్యులు డాక్టర్ సుభాన్, రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు ఎన్సీ బజారన్న, సిటీ మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్, డిసిసి కార్యదర్శులు అభినాయుడు, బి సుబ్రహ్మణ్యం, ఎస్సీ సెల్ డబ్ల్యూ సత్యరాజు, కాంగ్రెస్ నాయకులు సాంబశివుడు, వశీ భాష, అశోక్, కేశవరెడ్డి, సుంకన్న మహిళా కాంగ్రెస్ కె వెంకటలక్ష్మి, నాగమ్మ మొదలైన వారు పాల్గొన్నారు.  

About Author