విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : ఎంఈఓ
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మిడుతూరు ఎంఈఓ-2 శ్రీనాథ్ అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం వరకు వంట ఏజెన్సీ నిర్వాహకులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.మండలంలో ఉన్న మండల పరిషత్, ప్రాథమికోన్నత,జిల్లా పరిషత్ పరిషత్ 45 పాఠశాలల్లో 89 మందికి గాను 78 మంది వంట నిర్వాహకులు ఈ శిక్షణకు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనాథ్ మాట్లాడుతూ వచ్చే నెల జూన్-12 నుండి పాఠశాలలు ప్రారంభం కానున్నాయని పాఠశాలల్లో విద్యార్థులకు ఏ విధమైన భోజనం అందించాలి భోజనం నాణ్యతా ప్రమాణాలు పాటించాలనే వాటి గురించి అదే విధంగా ఆహార పట్టికలో ఉన్నటువంటి ఏ రోజుకి ఆ రోజు మెనూ వంటలు చేయాలని రాబోయే రోజుల్లో వర్షాకాలం రానున్నందున భోజనాల మీద ఈగలు దోమలు వాలకుండా చూసుకోవాలని వంటలు శుభ్రంగా చేసే విధంగా మీరు ఉండాలని ఎంఈఓ వంట నిర్వాహకులకు శిక్షణ ద్వారా వారికి వివరించారు.ఈ కార్యక్రమంలో డిటిపి చంద్రకాంత్ సిఆర్పీలు మౌలాబీ,వెంకటరమణ,ఎంఐ ఎస్ మధు తదితరులు పాల్గొన్నారు.