‘‘ఆర్యూ’’ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్ అధికారులను ఆదేశించారు. ఈరోజు పర్సిటీ పురుషుల హాస్టళ్లను తనిఖీచేసి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారాన్ని అందించాల్సిందిగా సిబ్బందికి సూచించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వంటశాలతోపాటు, డైనింగ్ హాళ్లు, హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆహారాన్ని వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాలని సిబ్బందికి, విద్యార్థులకు ఆయన సూచించారు. ఆదిశగా సరైన పర్యవేక్షణ చేయాలని హాస్టల్ అధికారులకు వి.సి. సూచించారు.