PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సామాన్యులకు.. కార్పొరేట్​​ వైద్యం..

1 min read

పేదలకు, ట్రాన్సజెండర్స్​ కు ఉచిత వైద్యం

  • ఆరోగ్య శ్రీ, ఈహెచ్​ఎస్​, ఇన్సూరెన్స్​  కింద అందుబాటులో వైద్యం
  • డాక్టర్​ సి.బి. రమేష్​ బాబు, రమేష్​ హాస్పిటల్ అధినేత

కర్నూలు, పల్లెవెలుగు: వైద్యరంగంలో రాణించే ప్రతిఒక్కరూ పేదలకు సేవ చేయాలన్న తలంపుతో రావాలన్నారు  సిబి ఆర్​ రమేష్​ హాస్పిటల్​ అధినేత డా. సి. రమేష్​ బాబు. మంగళవారం ఆయన ఛాంబరులో విలేకరులతో మాట్లాడారు. రమేష్​ హాస్పిటల్​ లో అన్ని వ్యాధులకు సంబంధించి వైద్య చికిత్సలు అందించేందుకు వైద్య నిపుణులు ఉన్నారని,  పేదలకు నాణ్యమైన … కార్పొరేట్​ వైద్యం అందించడమే తమ లక్ష్యమన్నారు. నగరంలోని ఢీ మార్ట్​ పక్కన ఐదేళ్ల క్రితం ప్రారంభించిన రమేష్​ హాస్పిటల్​  అంచలంచెలుగా ఎదిగిందన్నారు. ఇక్కడికి రాయలసీమతోపాటు కర్ణాటకలోని రాయచూరు, శిరుగుప్ప, బళ్లారి, తెలంగాణ లోని హైదరాబాద్​, మహబూబ్​ నగర్​, గద్వాల, అలంపూర్​, కొత్తకోట తదితర ప్రాంతాల నుంచి వచ్చి వైద్య సేవలు పొందుతున్నారన్నారు.  పేదలకు , ట్రాన్స్​ జెండర్స్​ కు ఉచిత వైద్యం అందిస్తామన్న డా. రమేష్​ బాబు… డబ్బు తక్కువగా ఉందని చెప్పిన వాళ్లకు కూడా వైద్యం చేసి పంపుతామన్నారు. తమను నమ్మి వచ్చిన వాళ్లకు డబ్బు ఉన్నా.. లేకున్నా.. నాణ్యమైన వైద్యం అందజేయడం బాధ్యతగా భావిస్తామన్నారు. గైనకాలజిస్ట్​, మధుమేహ వ్యాధి, చిన్న పిల్లల వైద్యలు, మెదడు,  నరాల వ్యాధి, ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండెకు సంబంధించిన వైద్య నిపుణులు తమ హాస్పిటల్​లో అందుబాటులో ఉన్నారన్నారు. ఆరోగ్యశ్రీ , ఈహెచ్​ఎ స్​, ఇన్సూరెన్స కింద వైద్యం అందిస్తామని పేర్కొన్న ఆయన… సదరు బాధితులతో పైసా కూడా వసూలు చేయమని స్పష్టం చేశారు. ప్రస్తుతం కార్పొరేట్​ వైద్యం అందించే వాటిలో రమేష్​ హాస్పిటల్​ లో కూడా  ఒకటి అని చెప్పుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా డా. రమేష్​ బాబు వెల్లడించారు.

About Author