రాఘవేంద్ర రెడ్డి వర్గానికే వగరూరు విద్యాకమిటి ఛైర్మన్లు
1 min readహైస్కూల్ విద్యాకమిటి ఛైర్మన్ దండు శేఖర్, ఎలిమేంటరి స్కూల్ ఛైర్మెన్ సోమేష్
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: మండల పరిధిలోని వగరూరు గ్రామంలో విద్యాకమిటి ఛైర్మన్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు తలపించాయి. నువ్వ నేన అనే రీతిలో ఉత్కంఠగా సాగాయి. గత కొన్ని రోజుల క్రితం విద్యాకమిటి ఎన్నికలు స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో అధికారులు వాయిదా వేశారు. అయితే జరిగిన విద్యాకమిటి ఎన్నికలు టిడిపి జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి వర్గం, టిడిపి నాయకులు మాధవరం రాఘవేంద్ర రెడ్డి వర్గాల మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో తిక్కారెడ్డి వర్గం పై మాధవరం రాఘవేంద్ర రెడ్డి వర్గం విషయం సాదించింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల తో కీ. శే మాజీ సర్పంచ్ రామిరెడ్డి ఆశీస్సులతో ఆయన సతీమణి రాఘమ్మ, తనయుడు పవన్ కుమార్ రెడ్డి లు బలపరిచిన దండు శేఖర్ ఛైర్మెన్ గా, వైస్ చైర్మన్ గా జయరాం గౌడ్ విజయం సాధించారు. మండల ప్రాథమిక పాఠశాల ఛైర్మెన్ గా సోమేష్, వైస్ ఛైర్మన్ గా చాకలి నాగలక్మి విజయం సాధించారు. వీరి కి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం విజయం సాధించిన ఛైర్మన్లు మాట్లాడుతూ రాఘవేంద్ర రెడ్డి సహయ సహకారాలతో స్థానిక రామిరెడ్డి కుటుంబ సభ్యుల ఆదేశాలతో పాఠశాలలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మా గ్రామంలో కులమతాలకుఅతీతంగా మాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ రుణ పడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్ కుమార్ రెడ్డి, వీరారెడ్డి, గోపాల్, లింగప్ప, నర్సన్న, రాఘప్ప, నాగన్న, ఈరన్న తదితరులు పాల్గొన్నారు.