PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాఘవేంద్రుని ఆశీస్సులు బాలన్న కే

1 min read

మంత్రాలయం గడ్డ బాలనాగిరెడ్డి అడ్డ అని మరో సారి చాటిన బాలన్న

నాల్గవసారి బాలనాగిరెడ్డి వైపే నియోజకవర్గ ప్రజలు

టిడిపి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి పై 12843 ఓట్ల మెజార్టీతో బాలన్న విజయం

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు మళ్ళీ బాలనాగిరెడ్డి కే వరించాయి. మంత్రాలయం గడ్డ బాలనాగిరెడ్డి అడ్డ అని మరో సారి చాటిచెప్పాడు బాలన్న. నాలుగో సారి కూడా మంత్రాలయం నియోజకవర్గం ప్రజలు బాలనాగిరెడ్డి వైపే చూపారు. దీంతో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర రెడ్డి పై 12843 ఓట్ల మెజార్టీతో బాలన్న విజయం సాధించారు. టిడిపి దెబ్బ కు రాష్ట్రంలో ఫ్యాన్ చిత్తుచిత్తుగా ఓడిన కర్నూలు జిల్లా మంత్రాలయం లో మాత్రం బాలనాగిరెడ్డి విజయం సాధించడం జరిగింది. ఇక్కడ పార్టీ ని చూడలేదు కేవలం బాలనాగిరెడ్డి నే చూసి ఓట్లు వేశారని అందుకే విజయం సాధించడం జరిగిందని పలువురు చర్చించుకుంటున్నారు. మే 13 వ తేదీన జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో  మంగళవారం చేపట్టిన ఓట్ల లెక్కింపులో 12843 ఓట్ల మెజార్టీతో టిడిపి అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర రెడ్డి పై గెలుపొందారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై భీమారెడ్డి లలితమ్మ ముద్దు బిడ్డ అయిన వై బాలనాగిరెడ్డి జులై 23 1964 న జన్మించారు. పదవ తరగతి వరకు చదువుకున్న ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టి సర్పంచ్ గా, సింగిల్ విండో అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. 2009 లో జరిగిన రాష్ట్ర విభజనలో భాగంగా తొలి నియోజకవర్గంగా ఏర్పడిన మంత్రాలయం నుంచి టీడీపీ అభ్యర్థిగా కాంగ్రెసు పార్టీ అభ్యర్థి దళవాయి రామయ్య పై 7 వేలకు పైగా మెజార్టీ సాధించారు. తర్వాత జరిగిన 2014, ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డి పై 12 వేలకు పైగా ఓట్లు సాధించగా 2019 ఎన్నికల్లో మళ్లీ టిడిపి అభ్యర్థి పి తిక్కారెడ్డి పై 23 వేలకు పైగా ఓట్లు సాధించి విజయం సాధించారు. ప్రస్తుతం నాలుగో సారి వాల్మీకి నాయకులైన రాఘవేంద్ర రెడ్డి పై 12843 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి గాలి వీస్తూన్నా మంత్రాలయం నియోజకవర్గంలో మాత్రం పార్టీలకు అతీతంగా రాంపురం రెడ్డి సోదరులకు వ్యక్తిగతంగా ఉన్న సంబంధాలే పేరు ప్రతిష్టలే బాలనాగిరెడ్డి గెలుపుకు దోహదం చేశాయని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

About Author