మండలంలో మోస్తారు వర్షం.. ఎస్ఆర్బిసి కాలనీలో కూలిన చెట్టు..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: గత 20 రోజుల నుంచి వర్షం లేక ఉక్కపోతకు అల్లాడుతున్న ప్రజలకు సోమవారం సాయంత్రం వర్షం పలకరించింది దాదాపు అరగంట కురిసిన వర్షానికి వీధులన్నీ జలమయమయ్యాయి తాసిల్దార్ కార్యాలయం వద్ద ఉన్న ఎస్ఆర్బిసి కాలనీలో ఈదురుగాలికి చెట్టు కూలింది .వాతావరణ శాఖ అధికారుల సమాచారం మేరకు ఈ రోజు రాత్రి నంద్యాల జిల్లా పలు ప్రాంతాల్లో భారీ వర్షం ఉన్నట్టు ప్రకటించారు. విద్యుత్ అధికారులు మాట్లాడుతూ వర్షానికి విద్యుస్తంభాలను ముట్టుకోవద్దని ముఖ్యంగా చెట్ల కింద ఉండడం క్షేమకరం కాదని పిడుగులు పడే అవకాశం ఉంటుందని ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు .మొత్తానికి వర్షం వల్ల ఉక్కపోత తగ్గి ప్రజలు ఉపశమనం పొందారు.