PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పై ర్యాలీ

1 min read

పల్లెవెలుగు వెబ్  వెలుగోడు:  జోన్ 26  అంతర్జాతీయ మాధక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం వెలుగోడు పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నాడు నిర్వహించారు.ఈ ర్యాలీలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు . ఈ ర్యాలీలో మత్తు పదార్థాలకు యువత విద్యార్థులు దూరంగా ఉండాలని, వాటిని నిర్మూలించాలని ప్లే కార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ షాషావలి మాట్లాడుతూమాదక ద్రవ్యాలు మనిషి మానసిక స్థితిపై ప్రభావం చూపడమే కాకుండాతమ శరీరా భాగాలను పాడు చేస్తాయన్నారు. మాదక ద్రవ్యాల ప్రభా వంతో యువత మత్తు కు బానిసలై తమ బంగారు భవిష్యత్ను నాశ నం చేసుకుంటున్నారని, జల్సాలకు అలవా టుపడిన యువత డబ్బుల కోసం నేరాలకు పాల్పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటు న్నారని, డ్రగ్స్కు అలవాటుపడిన వారి మెదడు మొద్దుబారి తాము ఏమి చేస్తు న్నారన్న విషయా న్ని మర్చిపోయి విచక్షణ కోల్పోయి తల్లిదండ్రు లను ఎదురిస్తూ ప్రేమ పేరుతో బాలికలను వేధిస్తూ ఫోక్సో కేసుల్లో నేరస్తులుగా మారుతు న్నారని, మాదక ద్రవ్యాల వైపు యువత ఆకర్షితు లుకావద్దనిఅన్నారు. వీటికిఅలవాటుపడిప్రాణాలుకోల్పోతున్నవారెందరో ఇంతకు ముందు 25 సంవత్స రాల వయస్సులో వ్యన నాలకు లోనైన వారు ఇప్పుడు 16ఏళ్లకే ఈ పదార్థాలు వాడుతున్నారని నివేదికలు చెబుతు న్నాయి అన్నారు. నేడు సమాజంలో ఎక్కువగా యువత మత్తు పదా ర్థాలకు బానిస అవుతున్నది. మాదక ద్రవ్యాల ఉచ్చులో పడ కుండా మానవాళిని రక్షించేందుకు మాదక ద్రవ్యాల వాడ కం లేని సమాజాన్ని సృష్టించేందుకు అందరూ కృషి చేయాలన్నారు .మద్యం, కల్తీ కళ్లు, సిగరేట్, బిడీ, గుట్కా, జర్దా, తంబాకు,గంజాయి, బంగీ, నల్ల మందు నన్ను నిరోధించే దిశగా అవగాహన కల్పించారు.

About Author