ఇండియా కూటమి అభ్యర్థి రామచంద్రయ్య గెలుపుకు విస్తృత ప్రచారం
1 min readఆదరించండి- అభివృద్ధి చేస్తాం…
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సిపిఐ నాయకులు.
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : ఇండియా కూటమి బలపరుస్తున్న సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి పి. రామచంద్రయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య, మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్ లు గురువారం మండలంలోని పుచ్చకాయల మాడ, హోసూర్, అటికెల గుండు, దేవనబండ గ్రామాలలో ఇంటింటికి తిరిగి విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా హోసూర్ లో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి అసెంబ్లీ అభ్యర్థి పి. రామచంద్రయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య లు మాట్లాడుతూ గత పాలకులు నియోజకవర్గం అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయకపోగా, ఎన్నికల సమయంలో మాత్రం తప్పుడు వాగ్దానాలతో ఓట్లు అడిగేందుకు వస్తున్నారని విమర్శించారు. ఇండియా కూటమి అభ్యర్థులను చట్టసభలకు పంపినట్లయితే నియోజకవర్గంలోని తుగ్గలి, మద్దికేర, వెల్దుర్తి, క్రిష్ణగిరి మండలాల లో మినీ రిజర్వాయర్లు ఏర్పాటుచేసి 60 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. పందికోన రిజర్వాయర్ కింద ఉన్న కుడి, ఎడమ కాలువల కింద పిల్ల కాలువలను ఏర్పాటుచేసి పూర్తిస్థాయిలో ఆయకట్టు భూములకు సాగునీరు అందిస్తామన్నారు. పత్తికొండ చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గా మార్చి పత్తికొండకు నిరంతరం తాగునీరు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల నుండి 100 పడక ల స్థాయికి పెంచుతామన్నారు. పత్తికొండ ప్రాంతంలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు, బీసీ బాలికల వసతిగృహం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.