రామకృష్ణుని సేవలు ఎనలేనివి…
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: అఖిల భారత కురువంశ నిత్యన్నదాన సత్రం, శ్రీశైలం కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. రామకృష్ణుడు నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామం లో నివాసముంటున్నారు. ఈ రోజు తేదీ :10-12-2024 మంగళవారం సాయంకాలం అనారోగ్యం తో స్వర్గస్తులయ్యారు. ఈ వార్త చాలా బాధాకరం, శ్రీశైలం లో దేవస్థానం వారు సత్రంకోసం స్థలం కేటాయించి నప్పటి నుండి సత్రం నిర్మాణం కోసం కీ. శే. ముచ్చుమర్రి కృష్ణమూర్తి గారి వెంట తిరిగి, సత్రం అభివృద్ధి కోసం కృషి చేశారు.వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము.కుటుంబ సభ్యులకు సత్రం కమిటీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేయుచున్నాము. రేపు ఉదయం కొణిదెల గ్రామం లో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.వారి కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని మనసారా ప్రార్తించున్నాము.బుధవారం ఉదయంకొణిదెల లోని వారి నివాసం దగ్గర శ్రీశైలం కురువ సత్రం కమిటీ అధ్యక్షులు ఎం. కె. రంగస్వామి,ఉపాధ్యక్షులు కె. మహేష్, కోశాధికారి,, కె. వెంకటేశ్వర్లు, సభ్యులు కె సి. నాగన్న లు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా సత్రం అధ్యక్షులు ఎం. కె రంగస్వామి మాట్లాడుతూ రామకృషుని మరణం సత్రం నకు తీరని లోటని తెలిపారు.కార్యక్రమం లో కొణిదెల నారాయణ, శివ లు పాల్గొన్నారు.