రణమండల పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా గుర్తించాలి
1 min read– ఎంఎల్ఏ పార్థసారధి
పల్లెవెలుగు వెబ్ ఆదోని: ఆదోని శివారు కొండలో ఉన్న రణమండల పరిసర పర్యాటక ప్రాంతాలుగా గుర్తించి, అభివృద్ధి చేయాలని ఆదోని శాసనసభ్యులు పార్థసారధి టూరిజం మరియు సాంస్కృతిక శాఖ మంత్రి దుర్గేష్ గారికి కలిసి కోరారు. మంగళవారం అసెంబ్లీ విరామ సమయంలో టూరిజం శాఖ మంత్రిని కలిసి రణమండల క్షేత్ర పరిసర ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన నివేదికను సమర్పించి, పర్యాటకశాఖ ద్వారా అభివృద్ధికి 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని కోరారు. రణమండల ఆంజనేయ స్వామి దేవాలయంకు వెళ్లే భక్తుల కొరకు మౌలిక వసతులు, సౌకర్యాల కల్పన మరియు రామజల చెరువు పరిసర ప్రాంతాల అభివృద్ధి చేయాలని విన్నవించారు. రణమండల ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం కొండ మార్గంలో రోడ్డు ఏర్పాటు కొరకు టూరిజం శాఖ ద్వారా నిధులు కేటాయించాలని, శ్రావణమాస ఉత్సవాల్లో వసతులు కల్పించాలని కోరారు.