రైస్ మిల్లర్లకు రాండమ్ సెక్షన్లో ద్వారా ధాన్యం తరలించాం
1 min read225. 67 కోట్ల రూపాయలు
రైతులకు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగింది
జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణి
రైతులు వర్షానికి ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్లో ఇప్పటివరకు 2 లక్షల 17 వేల 467 మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయం లక్ష్యానికి గాను లక్షలా 98 వేల 904 మెట్రిక్ టన్నుల ధాన్యమును ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసి, అనుసంధానం చేయబడిన రైస్ మిల్లులకు రాండమ్ సెలక్షన్ ద్వారా తరలించడం జరిగిందని, 225. 67 కోట్ల రూపాయలు రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి చెప్పారు. వాతావరణ శాఖ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో జిల్లాలో జిల్లాలో ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతున్నదని, మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందన్నారు. రైతులు కూడా తమ ధాన్యం వర్షానికి తడవకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఏదైనా సహాయం అవసరం అయితే దగ్గరలోని రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది సహకారం తీసుకోవాలన్నారు.