విహెచ్పి ఆధ్వర్యంలో “రాణి ఝాన్సీ లక్ష్మీబాయి ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రామచంద్ర నగర్ లోని శివ రామాలయం వద్ద “రాణి ఝాన్సీ లక్ష్మీబాయి ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం” ను ఈరోజు విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర రాష్ట్ర అధ్యక్షులు నంది రెడ్డి సాయి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ యువతులు, మాతృమూర్తులు ఉచితంగా ఇచ్చే కుట్టు శిక్షణను చక్కగా నేర్చుకొని తమ కాళ్ళపై తాము నిలబడడమే కాకుండా కుటుంబానికి ఇతోదికంగా సహాయ పడడం కోసం,ఆర్థికంగా స్త్రీలు స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యంతో విశ్వ హిందూ పరిషత్ ప్రయత్నం చేస్తున్నదని అందులో భాగంగానే ఈ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించామని కర్నూలు నగరంలో రెవెన్యూ కాలనీలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయం వద్ద, షరీన్ నగర్ లోని సద్గురు త్యాగరాజ రామాలయం లో, బుధవార పేటలోని శివాలయం ముందు కూడా ఉచిత కుటుంబ శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నామని ఆయా స్థలాల్లో నివశించే నిరుపేద మహిళలు ప్రజలు ఆయా సెంటర్లో శిక్షణ తీసుకొని లబ్ధి పొందాలని చెప్పి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర రాష్ట్ర సహకార్యదర్శి పుర్రె కోటేశ్వరరావు, బ్రహ్మానంద రెడ్డి రాష్ట్ర గోరక్ష ప్రభ, ప్రతాప్ రెడ్డి రాష్ట్ర విశేష సంపర్క కన్వీనర్, రమేష్ జిల్లా సేవా కన్వీనర్, భాను ప్రకాష్ కర్నూలు జిల్లా కార్యదర్శి, అయోధ్య శ్రీనివాసరెడ్డి జిల్లా కోశాధికారి, ఈపూరి నాగరాజు సహకార్యదర్శి, ఈపూరి లక్ష్మి జిల్లా దుర్గా వాహిని కన్వీనర్, సింధూర శ్రీవాణి దుర్గా వాహిని సహ కన్వీనర్, పావని మాతృ శక్తి సహా కన్వీనర్, శిక్షర్థలు తదితరులు పాల్గొన్నారు.