రాష్ట్రీయ బాల స్వస్థ, బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: కొయ్యలగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల డిప్పకాయలపాడులో శుక్రవారం ప్రాథమిక పాఠశాల నందు పిల్లలకు జరిగే ఆరోగ్య పరీక్షలు ఆర్.బి.ఎస్.కె జిల్లా ప్రోగ్రాం అధికారి డా:కె.నరేంద్ర కృష్ణ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ జరుగు విధానమును పరిశీలించారు. అలాగే పిల్లల యొక్క ఆరోగ్య వివరములు ఆప్ నందు నమోదు విధానమును పరిశీలించి అలాగే ఆరోగ్య పరీక్షలు నిర్వహించే విధానం గురించి సలహాలు మరియు సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ నరేష్.బొప్పన పాల్గొన్నారు.