PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ర‌త‌న్ టాటా మృతి బాధాక‌రం..  మంత్రి టి.జి భ‌ర‌త్

1 min read

ర‌త‌న్ టాటా జీవితం ఎంద‌రికో ఆదర్శం.. మంత్రి టి.జి భ‌ర‌త్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మృతి ప‌ట్ల రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ సంతాపం వ్య‌క్తం చేశారు. ర‌త‌న్ టాటా మ‌ర‌ణ‌వార్త త‌న‌ను ఎంతో దిగ్బ్రాంతికి గురిచేసింద‌న్నారు. ర‌త‌న్ టాటా ఆలోచ‌నా విధానంతో టాటా గ్రూప్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లార‌ని చెప్పారు. ఆయ‌న‌ ఎన్నో ప‌రిశ్రమ‌లు నెల‌కొల్పి లక్షలాది మంది యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించార‌ని మంత్రి టి.జి భ‌ర‌త్ కొనియాడారు. భార‌త‌దేశంలో పారిశ్రామిక రంగం ఎదుగుద‌ల‌కు ఆయ‌న ఎంతో కృషి చేశార‌న్నారు. ర‌త‌న్ టాటా జీవితం ఎంతో మందికి ఆద‌ర్శమ‌న్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *