రేషన్ పంపిణీ ఎండీయూ ఆపరేటర్ల ద్వారానే పంపిణీ చెయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: రేషన్ పంపిణీ ఎండీయూ ఆపరేటర్ల ద్వారానే పంపిణీ చెయాలి హొళగుంద: గ్రామాల్లో ఇంటింటికి రేషన్ పంపిణీని ఎండీయూ ఆపరేటర్ల ద్వారానే చెయాలని వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ మండల కన్వీనర్ షఫీవుల్లా డిమాండ్ చేసారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి గ్రామంలో లబ్దిదారుల ఇంటి వద్దకెళ్లి సరుకులు పంపిణీ చేయాల్సి ఉండగ మండల కేంద్రం హొళగుందతో పాటు కొన్ని గ్రామాలలో డీలర్లే షాపుల వద్ద వేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లీ బియ్యం, ఇతర నిత్యవసన సరుకులు వేసెందుకు ప్రభుత్వం ఎండియూ ఆపరేటర్లకు వేలకు వేలు జీతాలు ఇస్తుందని అయితే కొందరు డీలర్లు పాత పద్ధతి ప్రకారంగా షాపుల వద్ద వెయడం ఏమిటని ప్రశ్నించారు. దీనివల్ల వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడ్తున్నారని అధికారులు వెంటనే అలాంటి షాపులను గుర్తించి డీలర్లు కాకుండ ఎండియూ ఆపరేటర్ల ద్వార బియ్యం పంపిణీ జరిగెలా చర్యలు తీసుకోవాలని షఫీవుల్లా కోరారు.