రవీంద్ర … జి.పులయ్య ఇంజనీరింగ్ కళాశాలలో ఓరియంటేషన్ డే
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక వెంకాయపల్లిలోని రవీంద్ర ఇంజనీరింగ్ మహిళా కళాశాల మరియు జి. పులయ్య ఇంజనీరింగ్ కళాశాలలు సంయుక్తంగా ఓరియంటేషన్ డే ను నిర్వహించారు. కళాశాల చైర్మన్ జివిఎం మోహన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రవీంద్ర విద్యాసంస్థల సలహాదారు డా|| ఈ.ఎస్.చక్రవర్తి, ముఖ్య అతిథిగా ,గౌరవ అతిథులుగా రవీంద్ర విద్యా సంస్థల అధినేత శ్రీ జి.పుల్లయ్య గారు విచ్చేశారు. ముఖ్య అతిథి డా||ఇ.ఎస్.చక్రవర్తి మాట్లాడుతూ కొత్తగా బిటెక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలుపుతూ, మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులు ప్రోగ్రామింగ్ స్కిల్స్ పెంపొందించుకోగలిగితే ఉద్యోగాలు వాటంతట అవే మీ వద్దకు చేరుతాయని అన్నారు. ఏ బ్రాంచి చదువుతున్నమన్నది ముఖ్యం కాదు. ఏ బ్రాంచ్ వారైనా ప్రోగ్రామ్స్ ల్లో నైపుణ్యం సాధించగలిగితే వారికి కోకొల్లలుగా అవకాశాలు వస్తాయని తెలియజేశారు. అదే విధంగా ఆధునిక టెక్నాలజీ అయిన ఏఐ,ఎంఎల్, డేటా సైన్స్, డ్రోన్ టెక్నాలజీ పై పట్టు సాధించాలని అదేవిధంగా భావవ్యక్తీకరణ నైపుణ్యాలు పెంచుకోవాలని అప్పుడే సమాజంలో మీకు గుర్తింపు ఉంటుందని తెలియజేశారు. గౌరవ అతిధి శ్రీ జీ. పులయ్య మాట్లాడుతూ ప్రపంచం లో అవకాశాలకు కొదువలేదని రాబోయే 30 సంవత్సరాల ప్రణాళికను విద్యార్థులు ఈ మొదటి సంవత్సరంలోనే వేసుకోవాలని, గొప్ప గొప్ప ఆశయాలు ఉంటేనే మనం దేశ భవిష్యత్ పురోగతిలో పాలుపంచుకోగలమని, విద్యార్థులకు పిలుపునిచ్చారు. అదే విధంగా తల్లిదండ్రుల బాధ్యత కాలేజీలో చేర్పించడం వరకు మాత్రమే కాదు. పిల్లలు క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్చుకొనడంలో కూడా ఉంటుందని తల్లిదండ్రులకు ఓరియంటేషన్ డే సందర్భంగా చెప్పుకొచ్చారు. కళాశాల చైర్మన్ శ్రీ జీ.వీ.ఎం. మోహన్ కుమార్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కళాశాల అత్యాధునిక డిజిటల్ బోర్డులను అలాగే డిజిటల్ ల్యాబ్ లను ఈ సంవత్సరం ప్రవేశపెట్టామని మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులు వీటన్నింటినీ సద్వినియోగ పరుచుకోగలరని సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ డా|| కే.ఈ శ్రీనివాస మూర్తి మరియు డా||సి. శ్రీనివాస రావు మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు కళాశాలల నియామవళిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాలల డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.