PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అన్నం పరబ్రహ్మ స్వరూపం.. రాయలసీమ శకుంతల

1 min read

రాయలసీమ శకుంతల ఆధ్వర్యంలో ఘనంగా ఆహార భద్రత దినోత్సవం

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అన్నం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అని అహారాన్ని వృధా చేస్తే దైవాన్ని అవమానించినట్లేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, రాయలసీమ మహిళ సంఘ్ వ్యయవస్థాపక అధ్యక్షురాలు రాయలసీమ శకుంతల అన్నారు.ప్రపంచ ఆరోగ్య భద్రత దినోత్సవం సందర్భంగా రాయలసీమ మహిళ సంఘ్ అద్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమాన్ని శకుంతల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అశోక్ నగర్ లో  శకుంతల నడుపుతున్న పట్టణ నిరా శ్రయుల వసతి గృహం లో ని వృద్దులకు స్వయంగా ఇంటి దగ్గర శకుంతల ఆహారాన్ని జీరా రైస్ వండి వారికి ప్యాకెట్స్ అందజేశారు. అనంతరం, ఆహార ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్బంగా శకుంతల మాట్లాడుతూ భూమిపై ఉన్న సమస్త  జీవరాశికి మానవాళి మనుగడకు ఆహారం ఎంతో ప్రాముఖ్యత కలిగిందన్నారు. రైతులు ఎన్నో నెలల పాటు  కష్టపడి పంట సాగుచేసి ఆహారాన్ని పండిస్తారని అటువంటి ఆహారాన్ని నిర్లక్ష్యంగా చాలా మంది వదిలేస్తున్నారని తినగలిగినంత ఆహారాన్ని మాత్రమే వడ్డించుకొని మిగిలినది వృధా చేయరాదని శకుంతల తెలిపారు. ఈకార్యక్రమంలో  కేర్ టెకర్ లతశ్రీ, నిరాశ్రయ మహిళలు పాల్గొన్నారు.

About Author