రాయలసీమ నుండి అమరావతికి ప్రభూత్వ కార్యాలయాలను తరలించకండి
1 min readరాయలసీమ రవికుమార్,రాష్ట్ర అధ్యక్షులు,ఆర్వీపీఎస్.
సుంకన్న,రాష్ట్ర అధ్యక్షులు,రాయలసీమ హక్కుల పోరాట సమితి.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: గత ప్రభుత్వంలో రాయలసీమ కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కార్యాలయాలను కర్నూలు నుండి అమరావతికి తరలించవద్దని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్, రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుంకన్న ప్రభూత్వాన్ని డిమాండ్ చేశారు.కర్నూలు నగరంలోని స్థానిక ఆర్వీపీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ శ్రీబాగ్ ఒప్పందం మేరకు రాష్ట్ర రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయవలసివున్న పాలకులు నిర్లక్ష్యం కారణంగా తరతరాలుగా రాయలసీమ వివక్షకు గురవుతూనేవున్నదని అయితే గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం మేరకు రాష్ట్రస్థాయి కార్యాలయాలైన మానవహక్కుల కమిషన్ కార్యాలయం,లోకాయుక్త కార్యాలయం,విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ కార్యాలయం,వక్స్ బోర్డు కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేసారని అయితే కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ఆయా కార్యాలయాలను అమరావతికి తరలించాలని నిర్ణయించిదని దీనిని రాయలసీమ సంఘాలకు తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఇప్పటికే రాష్ట్ర రాజధాని,నీటి ప్రాజెక్టులు,న్యాయబద్ధమైన నీటివాట కోల్పోయి కరువు వలసలతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతం ఏర్పాటైన ప్రభుత్వ కార్యాలయాలను తరలించి ప్రస్తుత ప్రభుత్వం రాయలసీమకు మరింత అన్యాయం చేసే ఆలోచనలను మానుకోవాలని అన్నారు.రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు కేవలం అమరావతి నిర్మాణంతో సాధ్యమవుతాయని ప్రభుత్వం భావించడం రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలపై వివక్ష చూపించడమే అవుతుందని రాష్ట్రంలోని అన్నిప్రాంతాల అభివృద్ధి దిశగా కొత్త ప్రభుత్వం పనిచేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి, హక్కుల పోరాట సమితి నాయకులు విద్యాసాగర్,నాగేష్,అశోక్,మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.
.