రాయలసీమ యూనివర్సిటీ హాస్టళ్లను పరిశుభ్రంగా నిర్వహించాలి..వీసి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాయలసీమ యూనివర్సిటీ హాస్టళ్లను పరిశుభ్రంగా నిర్వహించాలని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్ ఆదేశించారు. వర్సిటీ పురుషుల, మహిళల హాస్టళ్లలను ఆయన ఈరోజు తనిఖీచేసారు. హాస్టల్ పరిసరాలతోపాటు, వంటగదుల్ని, స్టోర్ రూముల్ని, మెస్ హాళ్లని తనిఖీచేశారు. హాస్టల్ విధుల్లో ఉన్న ఉద్యోగులతోపాటు, విద్యార్థినీ విద్యార్థులుకూడా బాధ్యతతో మెలగాలన్నారు. హాస్టల్ పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంలో వర్సిటీ అధికారులకు సహకరించాలన్నారు. ఆదిశగా సరైన పర్యవేక్షణను కట్టుదిట్టంచేయాల్సిందిగా అధికారులకు వి.సి. సూచించారు.